నటనా రంగలో రాణిస్తున్న రాజీవ్ కనకాల - సుమ దంపతులు నిర్మాణ రంగంలో ప్రవేశించారు. ఈ దంపతలు ఇప్పుడు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించారు. ‘కె.సుమా రాజీవ్ క్రియేషన్స్’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సంస్థను, టైటిల్ లోగోనూ బుధవారం ఉదయం ఆవిష్కరించారు. బ్యానర్ లోగోను నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరించగా, టైటిల్ లోగోను మురళీమోహన్, శ్యాంప్రసాద్ రెడ్డి,  శ్రీకాంత్ కలసి ఆవిష్కరించారు. ‘లక్కు కిక్కు’ టైటిల్ సాంగును దర్శకుడు వినాయక్ ఆవిష్కరించారు. ఈ బ్యానర్ పై తొలిసారి నిర్మిస్తున్న ‘లక్కు కిక్కు’ గేమ్ షో తొలి సన్నివేశానికి ఎన్టీఆర్ క్లాప్ ఇవ్వగా వినాయక్ చిత్రీకరించారు. ఈ సందర్భంగా రాజీవ్ కనకాల మాట్లాడుతూ ‘ప్రేక్షకుల ప్రోత్సాహంతోనే తాము ఈ స్థాయికి చేరుకున్నామని’ చెప్పారు. అలాగే, తాము నిర్మిస్తున్న ‘లక్కు కిక్కు’ గేమ్ షో త్వరలోనే జీ తెలుగులో ప్రసారం కానుందని తెలిపారు.

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top