ATM ఈ పదం తెలియని వారు ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ATM... అంటే ఆటోమేటెడ్‌ టెల్లర్‌ మెషిన్‌ అని అర్థం. సగటు మనిషి మాత్రం ATM అంటే ఎనీ టైమ్‌ మనీ అని అని భావిస్తాడు. మనకు డబ్బులు అవసరమైనప్పుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ... విత్‌డ్రా చేసుకోనే మార్గం ఈ ATM ద్వారా సాధ్యమైంది. అనతి కాలంలో ఏటీఎంలు దేశ వ్యాప్తంగా విస్తరించాయి. ఇటీవల ఈ ఏటీఎం అరుదైన ఘనత సాధించింది. అక్టోబరు చివరి నాటికి దేశంలో ATMల సంఖ్య లక్ష మార్కును దాటిందని నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. ఏటీఎం మెషిన్‌ వచ్చిన తర్వాత బ్యాంకులకు వెళ్లి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి లేదు. కేవలం డిపాజిట్లకు మాత్రమే ఇప్పుడు బ్యాంలకు వెళ్లే అవసరం ఉంటోంది. 1990 చివరలో మన దేశంలో ఏటీఎంలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దేశంలోని మొత్తం ఏటీఎంల సంఖ్య 1,04,500లుగా గుర్తించారు. ఒక బ్యాంకుకు చెందిన ఏటీఎం నుంచి మరో బ్యాంకు ఖాతాదారులు డబ్బులు విత్‌ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కూడా నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షిస్తోంది. స్టేట్‌బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకులకు అత్యధికంగా 61,500ల ఏటీఎంలు ఉన్నాయి. అంటే దాదాపు 60 శాతం SBI గ్రూపులోనే ఉన్నాయి. ఇతర ప్రైవేటు, విదేశీ బ్యాంకులకు కలిపి 41,800లఏటీఎంలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతినెలా దాదాపు 20 కోట్ల లావాదేవీలు జరుగుతున్నట్టు అంచనా. వచ్చే రెండేళ్లలో అన్ని బ్యాంకులు కలిపి మరో లక్ష ఏటీఎంలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంఅవుతున్నట్టు సమాచారం. దేశంలో ప్రస్తుతం ప్రతి 10 లక్షల మంది జనాభాకు 85 ATMలు ఉన్నాయి.

0 comments:

Post a Comment

 
Top