తిరుపతిలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహణ తీరుపై నిరసనలు
వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ తెలుగు మహాసభల ఆహ్వానంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి
పేరు లేకపోవడంతో నిర్వాహకులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా
తెలుస్తుంది. అన్ని విధాల ప్రోటోకాల్ కు అర్హుడైనుటవంటి ఆయన పేరు
లేకపోవడంతో నిరసలు ప్రారంభమయ్యాయి. అదే విధంగా నిర్వాహణ సంఘంలో
ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్న శాసనమండలి చైర్మన్ చక్రపాణి, శాసనసభ స్వీకర్
నాదేండ్ల మనోహర్ పేర్లను ప్రధాన ఆహ్వానంలో ప్రస్తావించకపోవడం
వివాదస్పదమైంది.
కాగా సిఎం మాత్రం ప్రోటోకాల్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని
నిర్వాహకులకు సూచించారు. అయితే స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
ప్రభుత్వ తీరును నిరసిస్తూ వేలాదిమందితో ప్రపంచ తెలుగు మహాసభలను
ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ కవులు, కళాకారులు సభలను
బహిష్కరిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఇప్పటికే ఈవిషయంలో చాలామంది
తెలంగాణ కళాకారులు నిరసన తెలియజేశారు.
కాగా ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యేందుకు వచ్చినటువంటి ఇతర దేశస్థుల
ప్రతినిధులకు సౌకర్యం కల్పించడంలో నిర్వాహకులు విఫలమైనట్లు తెలుస్తుంది.
ప్రతినిధులుగా తిరుపతికి చేరుకున్న వారు ఎక్కడికి వెళ్లాలో, ఎక్కడ ఉండాలో
తెలియక రైల్వేష్టేషన్, బస్సస్టేషన్లలో ఉండిపోయారు. వారికి ఉండడానికి వసతి
సౌకర్యం కల్పించడంలో నిర్వాహకులు పట్టించుకోవడంలేదని బుధవారం నాడు
తిరుపతికి చేరుకున్న ప్రతినిధులు నిరసన తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment