కాలేజ్ స్టూడెంట్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కాలేజ్ స్టూడెంట్ గా నటించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ వెల్లడించాడు. ఈ సినిమా వినోదాత్మంగా ఉంటుందని తెలిపాడు. ఈ సినిమా వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం అవుతుంది. వచ్చే నెల 3 నుంచి 11 వరకూ హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ జరపుకొంటుంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ - సమంతాలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించనుంది.  గబ్బర్ సింగ్ సినిమా తరువాత హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే గతంలో జూనియర్ ఎన్టీఆర్ - దిల్ రాజు కలయికలో ‘బృందావనం’ అనే సూపర్ హిట్ వచ్చింది. దింతో ఈ కొత్త సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top