అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తూ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ వంటి ప్రొఫెషనల్ కామెడీ నటులను కాదని, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినీ అభిమానులు ‘మెంటల్ కృష్ణ’ - పోసాని కృష్ణమురళిని ‘2012 ఉత్తమ తెలుగు హాస్య నటుడి’గా ఎన్నుకున్నారు.       సర్వే వివరాలు : ఉత్తమ హాస్యనటుడు పోసాని కృష్ణమురళి ‘కృష్ణం వందే జగద్గురం’ సినిమాలో టిప్పుసుల్తాన్ గా, పోసాని పాత్ర నిడివి కొద్దిసేపే అయినా, వాస్తవానికి వ్యంగ్యం జోడిస్తూ పోసాని పలికిన మాటలు నాలుగే అయినా, ధియేటర్లలో నవ్వుల పూవులు పూయించడమే కాదు... ప్రేక్షకుల మదిలో ఆలోచనలనూ రేకెత్తించాయి. ‘బతుకు కోడి గుడ్డులాంటిది భయ్యా, ఏది పెట్ట అవుద్దో! ఏది ఆమ్లేట్ అవుద్దో తెలియదు భయ్యా!!’,   ‘వీడెబ్బా... లక్ష కోట్లేంటి మేడమ్’ వంటి మాటల్ని సీరియస్ గా చెబుతూ హాస్యం పండిస్తూనే... దర్శకుడు కోరుకున్న విధంగా మాటలయెక్క మర్మాన్ని ప్రేక్షకులు గుర్తుంచుకునేలా... ఆ పాత్రలో వేరేవ్వరినీ ఊహించుకోలేని విధంగా పోసాని నటన అమోఘం. రానున్న రోజుల్లో పోసాని ఇలాంటి పాత్రలు మరిన్ని పోషించాలని సగటు ప్రేక్షకులు కోరుకుంటూ... ‘2012 సంవత్సరానికి ఉత్తమ హాస్య నటుడి’గా ఎన్నుకున్నారు.         రాజేంద్ర ప్రసాద్ ఈ విభాగంలో రెండవ ఉత్తమ హాస్యనటుడిగా రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. ‘జులాయి’ సినిమాలో సీనియర్ పోలీస్ ఆఫీసర్ అయినా, తుపాకీ కూడా పేల్చడం రాని పాత్రతో రాజేంద్ర ప్రసాద్ నవ్వులు పండించాడు. ఎంతమంది కొత్త నటులు వచ్చినా హస్య సినీమా ప్రపంచంలో తన స్థానానికి వచ్చిన ఢోకా లేదని ఈ నటకిరీటి నిరూపించుకున్నాడు.

0 comments:

Post a Comment

 
Top