ఈ సంవత్సరం ఇబ్బడి - ముబ్బడిగా [దాదాపు 166 కు పైగా] సినిమాలు విడుదల కాగా, వాటన్నింటిని తోసిరాజని సినీ అభిమానులు ‘గబ్బర్ సింగ్’ నే 2012 ఉత్తమ తెలుగు సినిమాగా ఎన్నుకొన్నారు.     సర్వే వివరాలు : ఉత్తమ చిత్రం : గబ్బర్ సింగ్     గబ్బర్ సింగ్ దేవీశ్రీ ఉర్రూతలూగించే ‘కెవ్వుకేక’ సంగీతం, ‘నేను ట్రెండ్ ని ఫాలోఅవ్వను - ట్రెండ్ సెట్ చేస్తా’ లాంటి మాటల తూటాలు, బొమ్మల అమ్మాయిగా శృతి ‘అందాలు’, ‘నాకునేనే పోటీ - నాతోనాకే పోటీ’ అంటూ పవర్ స్టార్ తన అద్భుతమైన  ప్రధర్శనతో అభిమానులకు విందు భోజనం పెట్టిన తీరు... కలగలిపి,  2012 సంవత్సరంలో ‘గబ్బర్ సింగ్’ తన జోరు చూపించి ఉత్తమ చిత్రంగా ఎన్నికయ్యాడు. నిజానికి ‘గబ్బర్ సింగ్’ రీమేక్ చిత్రమే అయినా,  ప్రేక్షకులను వినోదంతో అలరించిన తీరు, తెలుగు నేటివిటీ కోసం  దర్శకుడు ‘హరీష్ శంకర్’ చేసిన కృషి ఈ సినిమాను ఉత్తమ చిత్రం గా ఎన్నుకోవడానికి కారణమయ్యాయి.      బిజినెస్ మ్యాన్ ఈ సర్వేలో బిజినెస్ మ్యాన్ సినిమా రెండవ ఉత్తమ సినిమాగా ఎన్నిక కావడం మారుతున్న తెలుగు ప్రేక్షకుల అభిరుచిని తెలియ చేస్తుంది. పూరీ జగన్నాథ్ రూపొందించిన బిజినెస్ మ్యాన్ సినిమా ‘క్రైమ్ కూడా ఓ వ్యాపారమే’ అనే నేపథ్యంతో తెరకెక్కింది. అయితే ఆ చిత్రంలో మహేష్  హీరో పాత్ర పోషించడంతో సినిమాకు కొత్త అందం వచ్చింది. బిజినెస్ మ్యాన్  చిత్రం రెండవ ఉత్తమ చిత్రంగా ఎన్నికయ్యింది.

0 comments:

Post a Comment

 
Top