2012 తెలుగు సినిమా ఉత్తమ దర్శకుడు విభాగంలో రాజమౌళి విజేతగా నిలిచాడు. ఈ టైటిల్ రేస్ లో క్రిష్, హరీష్ శంకర్, త్రివిక్రమ్ లను దాటుకుని రాజమౌళి విజేతగా అవతరించాడు.   సర్వే వివరాలు : ఉత్తమ దర్శకుడు   రాజమౌళి సినిమా మొత్తం ‘హీరో’ చుట్టూ తిరుగుతూ ఉండే టాలీవుడ్ లో, సగటు తెలుగు సినీ అభిమాని కలలో కూడా ఊహించని విధంగా ‘గాలికి కొట్టుకుపోయే సాధారణ ఈగను హీరోను చేసి’ అరడుగుల విలన్ ను ముప్పుతిప్పలు పెట్టించి, తన స్ర్కీన్-ప్లే, దర్శకత్వ ప్రతిభను గ్రాఫిక్స్ మాయాజాలంతో రంగరించి సృష్టించిన ‘ఈగ’ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసి జక్కన్నకు ఉత్తమ దర్శకుడు అవార్డును తెచ్చిపెట్టడమే కాకుండా, తెలుగు సినిమా గొప్పతనాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పింది. సాంకేతికంగా తెలుగు సినిమాని మరొక మెట్టు పైకి తీసువెళ్ళింది.       త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా మారిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘జులాయి’ తో జూలు విదిల్చాడు. బాధ్యత తెలుసుకునే ‘జులాయి’గా అల్లు అర్జున్ పాత్రను తీర్చిదిద్దిన విధానంతో త్రివిక్రమ్ రెండవ  ఉత్తమ దర్శకుడిగా ఎన్నికయ్యారు. ‘పొద్దున్న లేస్తే ఏం లాభం కోడిని కూరవండుకుని తినేస్తున్నాం’ వంటి ‘జులాయి’ మాటలతోనూ ఆకట్టుకున్న త్రివిక్రమ్ దర్శకుడుగా రెండవ స్థానంలో నిలిచారు.

0 comments:

Post a Comment

 
Top