బొమ్మెర రామచంద్రరావు నిర్మించే కొత్త చిత్రంలో మంచు మనోజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఈయన అనుష్క ప్రధాన పాత్రలో ‘పంచాక్షరి’ నిర్మించారు. తాజాగా మనోజ్ తో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ లావణ్య త్రిపాఠి దక్కించుకుంది. ‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైందీ భామ. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు సాధించలేదు. అయినా సరే, ‘అందాల రాక్షసి’గా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఆ చిత్రంలో ఆమె పోషించిన ‘గాయత్రీ వసంతం’ పాత్రను ప్రేక్షకులు బాగానే గుర్తుపెట్టుకున్నారు. ఆ చిత్రం విడుదలైన ఇన్నాళ్లకు మళ్లీ ఆమెకి మనోజ్ పక్కన నటించే అవకాశం దక్కింది. మరి, ఈ చిత్రమైనా ఈమెకూ మనోజ్ కూ కూడా హిట్ ఇస్తుందనే ఆశిద్దాం.

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top