విశ్వరూపం సినిమా విడుదల తేదీని కమల్ హాసన్ ఖరారు చేశారు. కమల్ హసన్ స్వీయ
దర్శకత్వంలో రూపొందిన విశ్వరూపం సినిమాను ఈ నెల 25న థియేటర్లలోనూ, ఫిబ్రవరి
2న డీటీహెచ్ లోనూ విడుదల చేస్తున్నారు. ముందుగా జనవరి 10 డిటిహెచ్ లోనూ,
11 న థియేటర్లలోనూ ఈ సినిమాను విడుదల చేయాలని కమల్ హసన్ భావించారు. అయితే
థియేటర్ల సంఘాలు దీనికి అభ్యతరం చెప్పడంతో ‘విశ్వరూపం’ విడుదలపై వివాదం
తలెత్తింది.
ఇప్పుడు వివాదానికి తెర పడిందని తెలుగు, తమిళ భాషల్లో ‘విశ్వరూపం’ సినిమాను
ఈ నెల 25న, ఫిబ్రవరి 2న డీటీహెచ్ లోనూ విడుదల చేస్తామని కమల్ హసన్
తెలిపారు.
అలాగే హిందీ వెర్షన్ ను థియేటర్లలో ఫిబ్రవరి 1, డీటీహెచ్ లో 2న విడుదల
చేస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment