2012 తెలుగు సినిమా ఉత్తమ నటుడు విభాగంలో 10 మంది హీరోలు పోటీపడగా... రామ్
చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబులను మించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను
ఉత్తమ నటుడిగా ప్రపంచ వ్యాప్త తెలుగు సినిమా అభిమానులు ఎన్నుకున్నారు.
సర్వే వివరాలు : ఉత్తమ నటుడు
‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్
‘గబ్బర్ సింగ్’ కలెక్షన్స్ పవన్ స్టామినా నిరూపిస్తే, ‘గబ్బర్ సింగ్’ నటన
పవన్ కళ్యాణ్ మేనియాను చాటి చెప్పింది. ‘ఖుషీ’ సినిమా నాటి జోష్, ఎనర్జీ,
పవన్ ట్రేడ్ మార్క్ మ్యానరిజమ్స్, ‘నాకు కొంచెం తిక్కుంది - కానీ దానికో
లెక్కుంది’ వంటి డైలాగ్స్ తో పవర్ స్టార్ అభిమానులు 'పవన్ మేనియాలో'
మునిగిపోయారు. టాలీవుడ్ రికార్డు విజయంతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా మరోసారి
చూపించి అన్నీ వర్గాలవారిని అకట్టుకున్న ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ 2012
ఉత్తమ నటుడుగా ఎన్నికయ్యారు.
మహేష్ బాబు
‘బిజినెస్ మ్యాన్’ సినిమాలో నటనకు గాను మహేష్ బాబు ఈ సర్వేలో రెండవ ఉత్తమ
నటుడుగా నిలిచారు. బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ చూపిన హైఓల్టేజ్ నటన ఈ
టాలీవుడ్ ప్రిన్స్ ను ఈ సర్వేలో రెండవ స్థానంలో నిలిపింది. ఈ సర్వేలో పవన్
కళ్యాణ్ కు గట్టిపోటీ ఇచ్చిన మహేష్ స్వల్ప తేడాతో ఫస్ట్ ప్లేస్ ను మిస్
అయ్యారు.
Home
»
2012
»
ANDHRANEWS
»
Film news
»
Pavan Kalyan
»
PAWAN KALYAN
»
powerstar
» Best Hero of 2012 : వీక్షకుల ఎన్నిక : ఉత్తమ నటుడు పవన్ కళ్యాణ్
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment