యాభై చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన ‘ఎనర్జిటిక్’ సంగీత దర్శకుడు ‘ దేవిశ్రీ ప్రసాద్’, మిక్కి.జె.మేయర్, మణిశర్మ  థమన్, కీరవాణీలను తన జెట్ స్పీడు తో ఓవర్ టేక్ చేసి 2012 ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎన్నుకోబడ్డాడు.   సర్వే వివరాలు : ఉత్తమ సంగీత దర్శకుడు    దేవీశ్రీ ప్రసాద్ తన సంగీతంతో సినీ అభిమానులకు ‘కెవ్వు కేక’ పుట్టించిన దేవీశ్రీ ప్రసాద్... గబ్బర్ సింగ్ సినిమాకు గాను ‘2012 - ఉత్తమ సంగీత దర్శకుడి’గా ఎంపిక అయ్యాడు. ‘గబ్బర్ సింగ్... గబ్బర్ సింగ్’, ‘కొప్పున పూలెట్టుకుని..’ లాంటి అద్దిరిపోయో సంగీత, నేపధ్య- సంగీతాలే కాకుండా, పెన్నుపట్టి ‘ ఏం పిల్లా...’ అంటూ రేస్ లో ముందుకు దూసుకు పోయిన దేవిశ్రీ... సంగీతంతో ప్రేక్షకులను  మైమపరిపించడంలో తనకు సాటిలేదని నిరూపించుకున్నాడు.     థమన్ ఈ సర్వేలో సంగీతం విభాగంలో  తమన్ రెండవ స్థానంలో నిలిచాడు. బిజినెస్ మాన్  సినిమా కోసం తమన్ స్వరపరిచిన పాటలు విశేషంగా అలరించాయి. ‘సారొస్తారా. రొస్తారా..’ అంటూ తమన్ ఇళయరాజా, కీరవాణిలను దాటుకుని రెండవ స్థానానికి చేరుకున్నాడు.

0 comments:

Post a Comment

 
Top