క్రీసెంట్ క్రికెట్ కప్ ను టాలీవుడ్ జట్టు గెలుచుకుంది. ఆదివారం నాడు
టాలీవుడ్, బాలీవుడ్ జట్ల మద్య హైదరాబాద్ లోని లాల్ బహుదూర్ స్టేడియంలో
జరిగిన మ్యాచ్ లో సునీల్ శెట్టి సారధ్యంలోని బాలీవుడ్ జట్టుపై శ్రీకాంత్
నేతృత్వంలోని టాలీవుడ్ జట్టు పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. పేద
మహిళలు, వికలాంగుల సహాయార్థం కోసం నిర్వహించిన ఈ పోటీలో టి-20 మ్యాచ్ ను
రెండు ఇన్నింగ్స్ లుగా విభజించి, ఒక్కో జట్టు పదేసి ఓవర్ల చొప్పున రెండు
ఇన్నింగ్స్ లు ఆడాయి. బాలీవుడ్ జట్టు కెప్టెన్ సునీల్ శెట్టి గాయం కారణంగా
ఆడలేక పోవడంతో సోనూసూద్ యాక్టింగ్ కెప్టెన్ గా వ్యవహరించారు.
హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మ టాస్ వేసి ఈ మ్యాచ్ ను
ప్రారంభించారు. ఈ పోటీలో చరణ్ తేజ్ మ్యాన్ ఆప్ ది మ్యాచ్ గా ఎంపిక అయ్యాడు.
రాష్ర్ట డిజిపి దినేష్ రెడ్డి చేతుల మీదుగా టాలీవుడ్ జట్టు క్రీసెంట్
క్రికెట్ కప్ ను అందుకున్నారు. ఈ మ్యచ్ సందర్భంగా నాగార్జున చేతుల మీదుగా
టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ కొంతమందికి ఆర్థిక సహాయం అందచేసింది.
క్రీసెంట్ ఛారటీ ట్రస్ట్ చైర్మన్ షఫీ ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రికెట్ మ్యాచ్
కు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ్, నిర్మాత డి.సురేష్ బాబు
వంటి ప్రముఖులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో తాగుబోతు రమేష్, ధనరాజ్, మాధవీలత, రేష్మా, మధుశాలిని...
సినీ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తనూరాయ్, తషూకౌషిక్ తమ నృత్యాలతో
వీక్షకులను అలరించారు.
Home
»
CINE CRICKET LEAUGE
»
Cricket
»
CRICKET UPDATES
»
Film news
» Tollywood Won on Bollywood : బాలీవుడ్ పై టాలీవుడ్ జట్టు విజయం
Related Posts
Open Letter from Sachin Tendulkar To His Fans
25 Dec 20120This is the open letter from Sachin Tendular To the world wide fans of Sachin, In th...Read more »
Gallery : Twenty Three years of Tendulkar : Sachin Updates
01 Jan 201301989 Sachin Tendulkar, at the age of 15, had become the youngest Indian to score a cent...Read more »
Gabbar Singh 2 Actress Anisha Ambrose Stills
24 Jan 20150Gabbar Singh 2 Actress Anisha Ambrose Stills Cinema Gallery Exclusively Posting the Gabbar Singh...Read more »
Celebrities Pays Homage to MS Narayana's Dead Body Photo Gallery
24 Jan 20150Celebrities Pays Homage to MS Narayana's Dead Body Photo Gallery ...Read more »
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.