తన నటనతో ఎందరో అభిమానులను ఆకట్టుకున్న నటుడు కృష్ణ. సూపర్ స్టార్ గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే కృష్ణ ఇక నటనకు స్వస్తి చెప్పనున్నారు. ఇక మీదట సినిమాల్లో నటించేది లేదని కృష్ణ తేల్చి చెప్పారు. జూబ్లీహిల్స్ లో ఒక హాటల్ ప్రారంభోత్సవానికి తన సతీమణి విజయనిర్మలతో హజరైన కృష్ణ విలేకరులతో మాట్లాడుతూ ‘ఇప్పుడు నాకు నటించేంత ఓపిక లేదు. అందుకే ఇక సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించినట్లే. రాజకీయాల్లోనూ నా పాత్ర ఉండదు’ అని చెప్పారు. తనకు ఛత్రపతి శివాజీ సినిమాను నిర్మించి నటించాలని ఉండేదని.. ఆ కోరిక తీరని కలగానే మిగిలిందని చెప్పారు. ‘తేనె మనసులు’ సినిమాతో వెండితెరకు పరిచయమైన కృష్ణ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. పద్మాలయా స్టూడియోను నెలకొల్పి, ఆ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. అల్లూరి సీతారామారాజు, సింహాసనం, మోసగాళ్ళకు మోసగాడు... వంటి సినిమాలు కృష్ణ కెరీయర్ లోనే కాకుండా, తెలుగు సినిమా చరిత్రలోనే అణి ముత్యాలుగా నిలుస్తాయి.

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top