ఓ తెలుగు సినిమా కోసం తమిళ హీరో పాట పాడాడు. తమిళంలో హీరోగా శింబు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్ని అనువాద సినిమాలతోనూ శింబు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు శింబు ఓ తెలుగు సినిమా కోసం పాటపాడాడు. ఈ పాటను చెన్నైయ్ లో రికార్డు చేశారు. మధుర శ్రీధర్ దర్శకత్వంలో ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకు మహత్ రాఘవేంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం శింబు పాట పాడిన విషయాన్ని మధుర శ్రీధర్ తెలిపారు. మధు శ్రీధర్ మాట్లాడుతూ ‘మహత్- శింబు మంచి స్నేహితులు. శింబు చేత పాట పాడించాలన్నది మహత్ ఆలోచన. శింబు మంచి గాయకుడు. అతను పాడిన పాట బాగా వచ్చిందని’ తెలిపాడు. కాగా, గతంలో ఓ తమిళ సినిమా కోసం శింబు గాయకుడిగా మారారు.

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top