సాయిరాం శంకర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘1000 అబద్ధాలు’. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో సాగుతోంది. ఇక, ఈ చిత్రం కథేంటంటే... ఆ కుర్రాడు ఏం చెప్పినా నమ్మేయ బుద్ధేస్తుంది. తాజ్ మహల్ ని హైదరాబాద్ కి తరలించారు అని చెప్పి ఎవ్వరినైనా నమ్మించేయగల మాటగాడు. కేవలం మాటల గారడీలపైనే ఆధారపడి బతికేస్తుంటాడు. అదే గారడీనే పెట్టుబడిపెట్టి జీవితంలో స్థిరపడాలని కలలు కంటాడు. ఇంతకీ అతడు కలలు నిజమయ్యాయా లేదా అన్నదే ఈ చిత్రం కథాంశం. ఈ చిత్రానికి చాలారోజుల తరువాత రమణ గోగుల సంగీతం సమకూర్చుతున్నారు.

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top