హైందవ సంప్రదాయంలో ఏకాదశి ఒక పవిత్రమైన దినం. ఏడాదికి 24 ఏకాదశిలు వస్తాయి. వాటిలో వైకుంఠ ఏకాదశి అత్యంత ముఖ్యమైనది. ఆషాడ శుద్ధ ఏకాదశిని నిద్రించిన విష్ణుమూర్తి ఈ ఏకాదశి రోజున నిద్ర మేల్కొంటాడని, ముక్కొటి దేవతలు వైకుంఠంలో ఉన్న ఆయన దర్శనానికి వస్తారని అందువల్లనే ఈ ఏకాదశికి ముక్కొటి ఏకాదశని, వైకుంఠ ఏకాదశి అని పేరు. ఈ రోజున విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యమని భక్తులు భావిస్తారు. దేవాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వారాల్లోంచి విష్ణుమూర్తి దర్శనం చేసుకుంటారు. ప్రాత:కాలంలో భక్తులు కూడా ముక్కోటి దేవతలతో కూడిఉన్న వైకుంఠ వాసిని దర్శనం చేసుకుంటే ముక్తి లభిస్తాదని, అందుకే దీన్ని మోక్షేకాదశి అని కూడా అంటారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణ పఠనం, జప, తపాదులు, నిర్వహిస్తారు. ‘భగవద్గీతా’ పుస్తకదానం చేస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి దర్శనానికి భక్తులు పొటేత్తారు. అర్థరాత్రి సమయంలో తిరుప్పావై పారాయణం తరువాత అర్చకుల వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ వైకుంఠ ద్వారాలు తెరిచారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ర్ట వ్యాప్తంగా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. అర్థరాత్రి నుంచే వివిధ ఆలయాల వద్ద ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తుల బారులు తీరారు. అలాగే, కురుక్షేత్ర ధర్మక్షేత్రంలో శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీత వైకుంఠ ఏకాదశి రోజే మొదలైనట్టు చెబుతారు. ఈ కారణంతోనే నేడు గీతా జయంతిని నిర్వహిస్తారు. 

0 comments:

Post a Comment

 
Top