ఆర్టీసి గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్, సీమాంధ్రలో ఎంప్లాయిస్ యూనియన్ విజయం సాధించింది. తెలంగాణ ప్రాంతంలో ఎంప్లాయిస్ యూనియన్, టిఎంయుతో కలిసి కూటమిగా పోటీ చేసింది. అయితే తెలంగాణలో టిఎంయు కూటమి అత్యధిక మెజార్టీతో గెలుపొందగా, సీమాంధ్రలో కూడా ఎంప్లాయిస్ యూనియన్ విజయం సాధించింది. గత 10సంవత్సరాలుగా ఆర్టీసిలో తిరుగులేని యూనియన్ గా పేరుతెచ్చుకున్న ఎన్ఎంయు శనివారం జరిగిన ఎన్నికల్లో ఘోరంగా పరాజయంపాలయింది. రాష్ట్ర వ్యాప్తంగా 212ఆర్టీసి డిపోల్లో జరిగిన ఎన్నికల్లో లక్షా 16వేలమంది ఆర్టీసి కార్మికులు ఓటుహక్కును వినియోగించుచున్నారు. కాగా టిఎంయు,ఎంప్లాయిస్ యూనియన్ కూటమి 12వేల 200ఓట్లతో ఎన్ఎంయుపై విజయం సాధించింది. దశాబ్ధంగా ఎదురులేకుండా విజయం సాధించిన ఎన్ఎంయు పారజయం పాలుకావడంతో ఆయూనియన్ భాధ్యులు నాగేశ్వర్ రావు, మహమ్ముద్ లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఓటమిపై విశ్లేషించుకుంటామని వారు తెలిపారు. కాగా సకల జనుల సమ్మె సందర్భంగా ఆర్టీసి సమ్మెను నీరుగార్చడంతోనే ఎన్ఎంయు ఓటమిపాలయిందని కార్మికులు అంటున్నారు.

0 comments:

Post a Comment

 
Top