రాష్ట్ర రాజకీయాలపై దేశ రాజధాని ఢిల్లీ వేడెక్కింది, అఖిలపక్ష సమావేశం తేదీ
దగ్గర పడుతుండడంతో హస్తినాకు తెలంగాణ సెగ తగిలంది. కాంగ్రెస్ హై కమాండ్
పిలుపు మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం ఉదయం ఢిల్లీ
చేరుకున్న ఆయన రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ గులాంనబీ అజాద్, కేంద్ర
హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై
చర్చించినట్లు తెలుస్తోంది.
తెలుగు మహాసభలు ఈనెల 28న ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్షం తేదీలను
మార్చవలసిందిగా షిండేను కిరణ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు షిండే మాత్రం
భేటీని వాయిదా వేసేదిలేదని, అఖిలపక్షానికి వచ్చే నేతలు కోరితే అప్పుడు
ఆలోచిస్తామని చెప్పినట్టు సమాచారం. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ
కూడా అఖిలపక్షం జరగాలని, వేరే నేతల అభిప్రాయాలు చెప్పిన తర్వాత నిర్ణయం
తీసుకోవచ్చునని చెప్పినట్లు తెలుస్తోంది.అలాగే కిరణ్‌కుమార్‌రెడ్డి యూపీఏ
చైర్‌పర్సన్ సోనియాగాంధీ తో ప్రస్తుతం భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇంట బయట ఎందరు వద్దంటున్న కిరణ్ మాత్రం ఎందుకు వాయిదా ఫై పట్టు బడుతున్నారో
ఎవ్వరికి అర్థం కావట్లేదు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment