ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత్‌లో ద్వైపాక్షిక సిరీస్ కోసం అడుగుపెట్టబోతోంది. ఈ నెల 25 నుంచి మొదలయ్యే సిరీస్‌లో పాల్గొనేందుకు పాక్ శనివారం ఇక్కడకు రానుంది. మధ్యాహ్నం లాహోర్ నుంచి బయల్దేరిన జట్టు ఢిల్లీ చేరుకుంటుందని, అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత నేరుగా బెంగళూరు రానున్నట్టు తెలుస్తోంది. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సిరీస్‌లో ఇరు జట్లూ రెండు టి-20, మూడు వన్డేలు ఆడనున్నాయి. బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం జరిగే టి-20తో దాయాదుల సమరానికి తెరలేవనుంది. రెండో టి-20 అహ్మదాబాద్‌లో 28న జరుగుతుంది. వన్డే సిరీస్ లో భాగంగా మొదటి . వన్డే 30న చెన్నయ్‌లో ప్రారంభమవుతుంది. రెండో వన్డేకు కోల్‌కతా లో జనవరి 3న , మూడో వన్డేకు ఢిల్లీ లో జనవరి 6న జరగనున్నాయి.భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయంటేనే అంచనాలు ఏస్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు, అలాంటిది ఐదేళ్ల సుదీర్ఘ విరామం త ర్వాత అంటే క్రికెట్ అభిమానుల్లో దానికుండే క్రేజ్ అంత ఇంత కాదు.

0 comments:

Post a Comment

 
Top