2012లో టాలీవుడ్ ముఖచిత్రం కలర్ ఫుల్ గా మెరిసింది. ఎప్పట్లాగే గుంపులు,
గుంపులుగా సినిమాలొచ్చాయి. స్టార్లు చక్రం తిప్పారు. అగ్ర దర్శకులు హవా
చూపించారు. హీరోయిన్లు చమక్కున మెరిశారు. బ్లాక్ బస్టర్లు వచ్చాయి. అంచనాలు
పెంచుకున్న కొన్ని సినిమాలు నిండా మునిగాయి. మరికొన్ని సినిమాలు సరికొత్త
రికార్డులు క్రియేట్ చేశాయి. మరి ఈ ఏడాది టాప్ లిస్టులో ఉన్న సినిమాలు
ఏంటి? 2012 టాప్ టెన్ సినిమాల విశేషాలు మీ కోసం.
టాప్ 1 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం పదేళ్ల తర్వాత తనివితీరా సక్సెస్ దాహం తీర్చుకున్నాడు. ఈ ఏడాది తిరుగులేని విజయం సాధించి నంబర్ వన్ సినిమాగా నిలిచింది గబ్బర్ సింగ్. పవన్-శృతిహసన్ జంటగా బండ్లగణేష్ నిర్మాణంలో హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. శంకర్ వంటి స్టార్ డైరెక్టర్ కే చేతకాని రీమేక్ విద్యను హరీష్ శంకర్ మాత్రం సమర్థంగా చేశాడు. దబాంగ్ లో చుల్ బుల్ పాండే తిక్క రెట్టింపు చేసి, గబ్బర్ సింగ్ తుపాకీని తయారు చేశాడు. అందులో పవన్ కళ్యాణ్ అనే బుల్లెట్ నింపి వదిలాడు. ఆ బుల్లెట్ నేరుగా లక్ష్యాన్ని తాకింది. ఇంకేముంది.. బాక్సులు బద్దలైంది. ఫ్యాన్స్ కు పండగ అయింది. టాప్ 2 ఇక ఈ ఏడాది టాప్ 2గా చెప్పుకోవాల్సిన సినిమా బిజినెస్ మేన్. మహేష్ బాబు కూడా ఈ ఏడాది మైండ్ బ్లాక్ చేసే హిట్ అందుకున్నాడు. 'దూకుడు' వంటి మెగా హిట్ తో తన బిజినెస్ స్ధాయిని పెంచుకుని, కొత్త లెక్కలు వేసుకుని పూరీని కలుపుకుని మహేష్ బాబు అసలు సిసలైన 'బిజినెస్ మ్యాన్'లా రెండు వేల థియేటర్స్ లో దిగాడు. అయితే సినిమాలో కథ కంటే మహేష్ తో పూరీ పలికించి డైలాగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మహేష్ తన స్టైయిల్, డైలాగ్ డెలివరీ, తన ఫెరఫార్మెన్స్ అండతో చేసిన ఈ ప్రయత్నం ఓ రేంజ్ లో హిట్టయింది. ఈ సినిమాతోనే మహేష్ పాపులారిటీ దేశవ్యాప్తంగా విస్తరించింది. టాప్ 3 ఈ ఏడాది తెలుగు తెరమీదికి కొత్త హీరో వచ్చాడు. అతను మహేష్ బాబు అంత అందంగా లేడు.. అతనికి పవన్ కళ్యాణ్ అంత ఫాలోయింగు లేదు.. అతనికి రామ్ చరణ్ కు ఉన్నంత బ్యాగ్రౌండూ లేదు.. ఈ ముగ్గురూ నెలకొల్పిన ఇండస్ట్రీ రికార్డులపై గురిపెట్టాడతను. అతని పేరు ఈగ.. అవును ఈగే. రాజమౌళి టీం విజువల్ వండర్. మన టాలీవుడ్ ఈగ ఈ ఏడాది పెద్ద మాస్ హీరోగా నిలబడింది. ఈగతో మీసం తిప్పించిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. ఇది మా తెలుగు సినిమా అని గర్వంగా తలెత్తుకునేలా ఉంది. తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదలై టాలీవుడ్ సినిమా గ్రాఫిక్స్ టాలెంట్ ఏంటో చూపించింది. టాప్ 4 మెగాధీరుడు రామ్ చరణ్ -మిల్కీబ్యూటీ తమన్నా జంటగా సంపత్ నంది తెరకెక్కించిన ఈ సినిమా 'రచ్చ'. ఈ మూవీ టాలీవుడ్ బాక్సాపీసు వద్ద రచ్చరచ్చ చేసింది. కొత్త డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమా కోసం చాలాకష్టపడ్డట్టే తెలుస్తోంది. పంచ్ డైలాగులు, ఫార్ములా కథతో ఈ మాస్ సినిమాని రూపొందించారు. రామ్ చరణ్ స్టైలిష్ నటన, తమన్నా అందాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాయి. కలెక్షన్ల పరంగానూ ఈ సినిమా అంచనాలను అందుకుని హిట్టయింది. టాప్ 5 ఈ ఏడాది టాప్ 5లో చెప్పుకోవాల్సిన సినిమా పూలరంగడు. పెద్ద డైరెక్టరుతో మర్యాద రామన్న తీసినంత మాత్రాన సునీల్ పెద్ద హీరో కాలేడు! కానీ, ఆయన పనితీరు మాత్రం పెద్ద హీరోల లాగే ఉంది. అప్పలరాజు ప్లాప్ తర్వాత దాదాపు ఏడాదికి పైగా గ్యాప్ ఇచ్చి సునీల్... పూల రంగడుగా హిట్ కొట్టాడు. టాప్ 6 యంగ్ హీరో నితిన్ కు ఈ ఏడాది కలిసి వచ్చింది. ఎనిమిదేళ్లుగా ఫ్లాప్ ల మీద ఫ్లాప్ లు ఎదురవుతున్నా.. సక్సెస్ కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్న నితిన్ కు ఇష్క్ రూపంలో సూపర్ హిట్ అందివచ్చింది. నితిన్ నిత్యమీనన్ జంటగా విక్రమ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాను టాప్ 6గా చెప్పుకోవచ్చు. టాప్ 7 గత ఏడాది 'బద్రీనాథ్'తో ప్లాప్ ను చవిచూసిన స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది జులాయితో హిట్ అందుకున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో బన్నీ-ఇలియానా జంటగా నటించారు. మాస్ టైటిల్, జోష్ ఉన్న హీరో, క్లాస్ టచ్ ఉన్న డైరక్టర్ వీరి కాంబినేషన్ అంటే అన్ని వర్గాల్లోనూ ఆసక్తే..అంచనాలూ అధికమే. ముఖ్యంగా మాస్ లో అల్లు అర్జున్ కి ఉన్న క్రేజే వేరు. అయితే తెలివైన హీరోయిజం, స్టైలిష్ గా నడిచే కథనం ప్రేక్షకులను మెప్పించి టాప్ 7లో నిలిచింది ఈ సినిమా. టాప్ 8 ఈ ఏడాది టాప్ 8 సినిమాగా 'ఢమరుకం'ను చెప్పుకోవచ్చు. నాగ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగ్-అనుష్క జంటగా నటించిన ఈ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు దర్శకుడు శ్రీనివాసరెడ్డి. దర్శకుడు శ్రీనివాసరెడ్డి కష్టం మాత్రం తెరపై అణువణువునా కనిపించింది. అంధకాసురుడు, నాగార్జున పాత్రలను ఆయన మలిచిన తీరు బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌ని డిజైన్ చేసిన విధానం వండర్. బ్రహ్మరాక్షసునితో నాగార్జున పోరాడటం, శివుని త్రిశూలంతో అంధకాసురుడ్ని వధించడం లాంటి సీన్లు పిల్లలకు విపరీతంగా నచ్చేస్తాయి. నాగార్జున ఇందులో చాలా అందంగా కనిపించారు. చాలా జోష్‌గా నటించారు కూడా. నాగార్జున కెరీర్‌లో తొలి ఫాంటసీ సినిమా ఇది. టాప్ 9 ఈ ఏడాది చిన్న సినిమాలకు కూడా బాగానే కలిసి వచ్చింది. కొత్త డైరెక్టర్ చిన్న సినిమాగా వచ్చిన 'ఈ రోజుల్లో' అనూహ్య విజయం సాధించింది. కొత్త నటీనటులతో మారుతి తెరకెక్కించిన ఈ సినిమా ఎవరు ఊహించని విజయాన్ని సొంతం చేసుకుని అందరి దృష్టిపడేలా చేసుకుంది. డిఫరెంట్ పబ్లిసిటీతో విడుదలకు ముందు బాగా ఆసక్తి రేపింది. ఇది యూత్ ను టార్గెట్ చేసిన ఓ లవబుల్ మూవీ. అతితక్కువ బడ్జెట్ తో విడుదలై అత్యధిక కలెక్షన్ గా సాధించిన 'ఈ రోజుల్లో' టాప్ 9లో నిలిచింది. టాప్ 10 టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటించిన ‘సుడిగాడు' సినిమా ప్రేక్షకులను ఓ రేంజ్ లో అలరించింది. అల్లరి నరేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించి సుడి తిరిగేలా చేసింది. సాధారణంగా అల్లరి నరేష్ చిత్రాలు అంటే హిట్ సినిమాల ప్యారెడీలు కథలో కలిసిపోయి అప్పుడప్పుడూ వచ్చి నవ్విస్తూంటాయి. అలాంటిది పూర్తిగా ప్రతీ సీనూ ప్యారడీలతో రూపొందితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించి సక్సెస్ అయ్యారు. ఈ సినిమాను ఈ ఏడాది టాప్ 10గా చెప్పుకోవచ్చు.

0 comments:
Post a Comment