హైదరాబాద్: కళంకిత మంత్రులను కొత్త ముఖ్యమంత్రి తన మంత్రవర్గంలోకి తీసుకోకూడదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు బుధవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో విలేకరుల సమావేశంలో కోరారు. అవినీతికి పాల్పడిన మంత్రులను మంత్రివర్గానికి దూరంగా ఉంచాలని ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని హెచ్చరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అవినీతిపరులను ప్రోత్సహించాడని ఆందుకే ఆయన మంత్రివర్గంలో చాలామంది అవినీతిపరులేనన్నారు. రోశయ్య హయాంలో కూడా ఆ కళంకిత మంత్రులే ఉన్నారన్నారు.

వైఎస్ హయాంలో మంత్రులు లక్షలకోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారన్నారు. కొండలు, గుట్టలు కొల్లగొట్టి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. అలాంటి మంత్రులను తీసుకుంటే అవినీతి మరింత పెచ్చరిల్లుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ఆదర్శ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అశోక్ చవాన్ను, కామన్వెల్తుతో ఆరోపణలు ఎదుర్కోన్న కల్మాడిని, 2జి స్పెక్ట్రంలో రాజాపై చర్యలు తీసుకున్నానని చెప్పే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ పార్లమెంటు సభ్యులను అందించిన ఆంధ్రప్రదేశ్ ల జరుగుతున్న అవినీతినిపై ఎందుకు మౌనంగా ఉంటారని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అంతా మీడియా బయట ప్రజలకు చూపించిందని, అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం స్పందించటం లేదని ఆయన అన్నారు. కళంకిత మంత్రులను తీసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం ఊరుకోదన్నారు.

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top