న్యూఢిల్లీ: రికార్డులు సృష్టికర్త, భారత అభిమానుల క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ క్రికెట్ చరిత్రలో మరో మైలు రాయి దాటాడు. ఇప్పటి వరకు ఎవరూ సాధించని ఫీట్ సాధించి మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో భారత్-నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న ఇన్నింగ్‌లో నెదర్లాండ్ బౌలర్ డష్కాటే వేసిన నాలుగో ఓవర్లో సచిన్ వరుసగా మూడు పోర్‌లు కొట్టి ప్రపంచ కప్ చర్రితలో రెండు వేల పరుగుల మైలురాయిని దాటిన తొలి బ్యా ట్స్‌మన్‌గా సచిన్ రికార్డు సృష్టించాడు. దీంతో సచిన్ మరో అరుదైన ఘనత సాధించాడు.


నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో డష్కాటె వేసిన ఇన్నింగ్న్ నాలు గో ఓవర్ చివరి బంతిని మాస్టర్ ఫోర్ కొట్టడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. సచిన తన 27వ పరుగు వద్ద ఈ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాంటింగ్ మినహా ప్రస్తుత క్రికెటర్లు ఎవరూ సచిన్ దరిదాపుల్లో కూడా లేరు. పాంటింగ్ 42 మ్యాచ్‌లలో 1577 పరుగులు చేశాడు.

0 comments:

Post a Comment

 
Top