సమ్మోహన సంగీత సంచలనం అంటూ ఇటీవల అంగరంగ వైభవంగా విడుదైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘శక్తి’ ఆడియోకు మిశ్రమ స్సందన వస్తోంది. అయితే వీటిలో రెండు పాటలు మాత్రమే మళ్లీ మళ్లీ వినిపించేలా ఉంటే మిగతావి చిత్రీకరణను బట్టి చొచ్చుకుపోయే విధంగా ఉన్నాయి. కాగా ఈ రెండింటిలోనూ ఒక పాట బాలీవుడ్ హిట్ మూవీ అయిన ‘దబాంగ్’లోని పాపులర్ ఐటమ్ సాంగ్ అయిన ‘మున్నీ కా బద్నామీ’ పాటకు కాపీగా అ(వి)నిపిస్తోంది.
‘యమగా ఉందే నీ అందం ఎయిత్ వండర్ లా’ అంటూ మొదలయ్యే ఆ పాటలో పాట ప్రారంభంలో వచ్చే మ్యూజిక్, ‘నచ్చావే మాయాబజార్’ అనే లైన్ల దగ్గర వచ్చే మ్యూజిక్..ఇవన్నీ వింటే మణిశర్మ మక్కీకి మక్కీగా ‘దబాంగ్’ ఐటమ్ పాటను వాడుకున్నాడా అనిపిస్తుంది. కాకపోతే ఈ పాటల రైట్స్ కి సంబంధించి ఇప్పటికే హెచ్చరిక ప్రకటన వచ్చింది. అది మణిశర్మ గమనించాడో లేదో లేక ఆ హెచ్చరిక ప్రకటన వచ్చేలోపు మణి ఆ ట్యూన్ ని వాడేసుకున్నాడో తెలియదు గానీ మొత్తానికి ‘శక్తి’కి సంబంధించి సినిమాలో ఇంకెన్నీ కాపీలు కనిపిస్తాయో వేచి చూడాలి.

0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.