హైదరాబాద్: 30 మంది మంత్రులు వ్యతిరేకించినా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా చేసిన ఘనత నాదేనని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి హనుమంతరావు ఆదివారం ఓ టీవీ ఛానల్ లో ప్రసారమయిన చర్చాకార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. నేను, దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కలిసి పిసిసి అధ్యక్షుడిగా చేశామన్నారు. ఎవరు ఉన్నా లేకున్నా కాంగ్రెసు పార్టీ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మీద అభిమానం ఉండవచ్చు. కానీ ఎవరైనా కాంగ్రెసు లో ఉంటేనే నాయకుడిగా ఎదుగుతారన్నారు. అందరు కలిస్తేనే కాంగ్రెసు అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే అందరితోపాటు ఇందులో వైయస్ పాత్ర కూడా ఉందని ఆయన అన్నారు. కానీ ఆయన ఒక్కడినే అనడం మంచిది కాదన్నారు. పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఎవరికీ గుర్తుకు రాకపోవటంపై ఆయన ప్రశ్నించారు. ఎవరున్నా లేకున్నా కాంగ్రెసు పార్టీ ఉంటుంది. వైయస్ చరిష్మా వల్లే కాంగ్రెసు గెలిస్తే 1998లో ఎందుకు గెలవలేదని ఆయన ప్రశ్నించారు.

2014లో కాంగ్రెసు ను గెలిపించడానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారని అన్నారు. జగన్ తన తండ్రి తరువాత ఆ అధికారంలో కూర్చోవడానికి ఓదార్పు పేరుతో ప్రచారం మొదలు పెట్టాడన్నారు. అయితే తామేవరమూ జగన్ వర్గీయుల్లా ఆయన మీటింగు రసాభాస చేయటం లేదన్నారు. తాను పాపులర్ అవడానికి ఇలాంటి పనులు జగన్ ఇలాంటి పనులు చేయటం లేదన్నారు. వైయస్ ను తాను ఈనాటికి అభినందిస్తానన్నారు. వ్యక్తిగతంగా ఎవరిపైనా కోపం లేదని, అయితే వైయస్ బొమ్మ పెట్టుకొని సోనియాను తిట్టడాన్ని తాను జీర్ణించుకోలేక పోతున్నట్టు చెప్పారు. విమర్శించే అధికారం ఎవరికైనా ఉందని, వారు విమర్శించుకుంటే మాకు అభ్యంతరం లేదన్నారు. చాలా పత్రికలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయన్నారు.

1 comments:

 
Top