హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి బొమ్మ తీసేసి సాక్షి దినపత్రికలో ఏమైనా రాసుకోవాలని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు సలహా ఇచ్చారు. కాంగ్రెసును బలోపేతం చేయడానికే సాక్షి పత్రిక, చానెల్ పెట్టారని ఆయన అన్నారు. తనను రెచ్చగొడితే సాక్షి అసలు రంగు బయటపెడతానని ఆయన వైయస్ జగన్ ను హెచ్చరించారు. అవినీతి గురించి మాట్లాడే హక్కు సాక్షికి లేదని ఆయన అన్నారు. ఓ తెలుగు టీవీ చానెల్ నిర్వహించిన ఫేస్ టు ఫేస్ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఆదివారం మాట్లాడారు. సోనియా గాంధీని సాక్షి అవమానించడం దారుణమని ఆయన అన్నారు. వైయస్ బొమ్మ పెట్టుకుని సోనియా గాంధీని విమర్శిస్తారా అని ఆయన అడిగారు.

వైయస్ జగన్ ఎవరో తనకు తెలియదని, పార్లమెంటు సభ్యుడు తెలుసునని, అతని మీద తనకెందుకు కోపముంటుందని విహెచ్ అన్నారు. సోనియాను విమర్శించే హక్కు సాక్షికి లేదని ఆయన అన్నారు. ఏ జాతీయ చానెల్ కూడా సోనియాపై ఇంత దారుణమైన విమర్శలు చేయలేదని ఆయన అన్నారు. సాక్షఇ పత్రిక పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన అడిగారు. వైయస్ జగన్ తన మిత్రుడి కుమారుడని ఆయన అన్నారు. సాక్షి కథనాలపై కాంగ్రెసు కార్యకర్తలు బాధపడుతున్నారని ఆయన చెప్పారు. 2009 ఎన్నికల్లో తాను కూడా ప్రచారం చేశానని, వైయస్ ముఖ్యమంత్రి కాబట్టి హెలికాప్టర్ లో తిరిగి ఉంటారని, ముఖ్యమంత్రికి వచ్చే ప్రచారం వేరు తనకు వచ్చే ప్రచారం వేరని ఆయన అన్నారు.

0 comments:

Post a Comment

 
Top