హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి వ్యతిరేకంగా కథనాలు రాసిన కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షిమీడియాపై ఆరోగ్యశాఖ మంత్రి దానం నాగేందర్ కదం తొక్కారు. సాక్షి కథనానికి వ్యతిరేకంగా ఆయన సిటీ సెంటర్లోని వైయస్సార్ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు. సాక్షి కథనం కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశాయని అన్నారు. ఈ ధర్నాలో పొంగులేటి సుధాకరరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే సాక్షిలో ఇలాంటి కథనాలు వచ్చి ఉంటే చర్యలు తీసుకునేవారని వారన్నారు. సాక్షిలో వచ్చిన కథనాన్ని దానం ఖండించారు.

పార్టీని విమర్శించే వారికి పుట్టగతులుండవని పార్లమెంటు సభ్యుడు రాజయ్య అన్నారు. సోనియాపై సాక్షి కథనాలకు బాధ్యత వహిస్తూ జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. సాక్షి వెంటనే తన కథనాలు సైతం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కథనాలు ఉపసంహరించుకోకున్నా, జగన్ క్షమాపణలు చెప్పకున్నా తీవ్ర పరిణామాలు ఉంటాయని రాజయ్య అన్నారు. సాక్షిలో వచ్చిన కథనాలు కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.

0 comments:

Post a Comment

 
Top