హైదరాబాద్ : కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు తల్లి విజయలక్ష్మి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు కూడా జగన్, విజయలక్ష్మిలు రాజీనామా చేశారు.
వైఎస్ మరణానంతరం 14 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు మనస్తాపం చెంది ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి అయిదు పేజీల బహిరంగ లేఖను రాశారు.
ఆయన తన రాజీనామా లేఖను బుధవారం లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు సమర్పించనున్నారు. తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి పదవి విషయంలో అధిష్టానం వైఖరికి తీవ్ర ఆవేదనకు గురైన జగన్ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన రాజీనామా రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
Home
»
ANDHRANEWS
»
jagan
»
POLITICAL NEWS
»
Regional news
»
tolly Updates
»
VIJAYAMMA
»
YS JAGAN
»
YSR
» ఎంపీ పదవికి వైఎస్ జగన్ రాజీనామా
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.