హైదరాబాద్: హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఈ విగ్రహ ప్రతిష్టాపనకు 30 లక్షల రూపాయలు ఖర్చవుతాయని అంచనా.

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై సీమాంధ్రుల విగ్రహాలే ఎక్కువగా ఉన్నాయని, తెలంగాణకు చెందిన కొమురం భీమ్ వంటివారి విగ్రహాలు లేవని తెలంగాణవాదులు అంటూ వస్తున్నారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, గిరిజనుల భూమి హక్కుల కోసం కొమురం భీమ్ పోరాటం చేశాడు. దీంతో కొమురం భీమ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్ఠించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపిలతో పాటు పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.

0 comments:

Post a Comment

 
Top