ఢిల్లీ: తెలంగాణా అంశానికి సంబంధించి కాంగ్రెస్ కోర్ కమిటీ కసరత్తులు ప్రారంభించింది. ఒత్తిళ్ల నుంచి బయట పడేందుకు కాంగ్రెస్ తాజా వ్యూహం రచిస్తుంది. దీనిలో భాగంగానే అధిష్టానం తెలంగాణా ప్రజా ప్రతినిధుల రాజీనామాలు ఉపసంహరించుకోవాలని కోరనున్నట్లు తెలుస్తోంది.సంప్రదింపుల కమిటీ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ అధిష్టాన వర్గం యోచిస్తున్నట్లు సమాచారం. ఒక వైపు తెలంగాణా వాదులు, మరో వైపు సమైక్య వాదులు తమ వాదనలు పర్వం ముమ్మురం చేసిన తరుణంలో కోర్ కమిటీలో వాడి వేడి చర్చలు కొనసాగుతున్నాయి. బుధవారం సీమాంధ్ర నేతలు ప్రణబ్ ముఖర్జీ కలిసి తమ వాదనను విన్నవించే ప్రయత్నం చేశారు. దీంతో ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిణామాలను ఒక కొలిక్కి తీసుకురావాలని అధిష్టానం యోచిస్తోంది.

హైదరాబాద్‌తో సహా అన్ని అంశాలను నాలుగు అంశాల ప్రాతిపదికన చర్చించి పరిష్కార దిశగా అధిష్టానం అడుగులు వేస్తోంది. మూడు ప్రాంతాల నేతలతో సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ముగ్గురు లేదా నలుగురుతో కమిటి ఏర్పాటు చేసి తెలంగాణాతో సహా ఆంధ్ర ప్రాంత అంశాలను సంప్రదింపుల కమిటీలో చర్చించే అవకాశం ఉంది.

0 comments:

Post a Comment

 
Top