దర్శకుడు నిర్మాత వైవీఎస్ చౌదరి ప్రస్తుతం పవన్ ని ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. అతనికి పవన్ ని వాడుకోవలసిన అవసరం ఏమొచ్చింది? అతను అనుకున్నా పవన్ అంగీకరించాలి కదా...? అని పవన్ అభిమానుల మదిలోని ప్రశ్నలు ఇవే. అసలు సంగతి ఏమిటంటే.....చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా వస్తున్న రేయ్ చిత్రం విడుదలకు సిద్దంగా ఉన్నది. దాంతో ఈ సినిమాని హిట్ బాటలో నడిపించేందుకు పవన్ చేత ఈ సినిమా ప్రచారం చేయించాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎలాగైనా పావని ఒప్పించి రేయ్ సినిమా వేడుకలకి అతన్ని తీసుకొస్తే తన ప్రయత్నం ఫలిస్తుందని వైవీఎస్ చౌదరి అభిప్రాయం. అవకాశం ఉంటె మొత్తం మెగా హీరోలతో ఈ చిత్ర ప్రమోట్ చేయించాలని అనుకుంటున్నాడు. మరి వైవీఎస్ చౌదరి ప్రపోజల్ కి పవన్ అంగీకరిస్తాడో....లేడో...చూడాలి మరి.

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top