బాలీవుడ్ నటి జియాఖాన్ మృతి చెందటంతో బాలీవుడ్ పరిశ్రమ విషాదంలో ముంచేసింది. మునుముందు మంచి భవిష్యత్తు ఉన్న హీరోయిన్ ఇలా మరణించడం అందరిని బాధపెడుతుంది. ఆమె మరణానికి అసలు కారణాలు మాత్రం ఇంకా తెలియడం లేదు. జియా ఖాన్ మరణం వెనుక ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా కారణం అయి ఉండవచ్చు అనే ఊహాగానాలు బాలీవుడ్ సర్కిల్లో వార్తలు వస్తున్నాయి. జియాఖాన్ మరణానికి ముందు రాత్రి 11 గంటల వరకు ఆమె బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆమె ప్రేమ వ్యవహారం చాలా సీక్రెట్ గా ఉన్నది. బాలీవుడ్ నటుడు ఆదిత్య పాంచోలి తనయుడు సూరజ్ తో గత కొంత కాలంగా ఆమె సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల సూరజ్ ఈమెను నిర్లక్ష్యం చేసి మరో అమ్మాయితో సన్నిహితంగా ఉండటంతో మరో యువతితో స్నేహంగా ఉండటం ఆమెను తీవ్రంగా కలచివేయడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది.

0 comments:

Post a Comment

 
Top