సినిమా పాటలంటే చాలా మందికి ఆసక్తి. అందులో ఈ సినిమా పాటల్లో వాన పాటలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా ఓ తెలుగు సినిమాలో వాన పాట తెరకెక్కనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్-మహేష్ లు హీరోలుగా నటిస్తుండగా, అంజలి-సమంత కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో అంజలి-వెంకటేష్ జంట పై వాన పాటను జనవరి 4 నుంచి చిత్రీకరించనున్నారు. జనవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో ఈ ఒక్కపాట షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది.

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top