తెలంగాణా పచ్చి మోసం... బయట పడిన లీకులు


న్యూ ఢిల్లీ:  తెలంగాణా మీద కాంగ్రెస్ ఆడుతున్న కపట నాటకం బట్ట బయలైంది. తెలంగాణా ఇవ్వటానికి ఏ మాత్రం ఇష్టం లేని కాంగ్రెస్, 2014 ఎన్నికల దాకా ఏం చేస్తారో తెలియదు....ఒకసారి తెలంగాణా మీద ప్రకటన చేసాం...ఇరుకున్నాం. అప్పుడేదో తెలిసో తెలియక చేసాం....ఈ సారి భాద్యత మీదే అంటూ హుకుం జారీ చేసారు మేడం సోనియా గాంధీ. ఈ బాద్యతను దిగ్విజయ్ సింగ్, హోం మినిస్టర్ షిండే, అహ్మద్ పటేల్, చిదంబరం లకు అప్ప చెప్పింది. తెలంగాణా మీద వీరు మాట్లాడుకున్న సీక్రెట్స్ బట్ట బయలయ్యాయి. ఆ సీక్రెట్స్ బయటకు వెళ్ళయానే విషయం ఆలస్యంగా గ్రహించిన నేతలు వెంటనే సత్వర చర్యలు చేపట్టింది. అప్పటికే నేషనల్ మీడియా  చేతికి చిక్కాయి ...తెలంగాణా సీక్రెట్స్.     
సీక్రెట్ లో ముఖ్యాంశాలు:
 
మీరు డిసెంబర్ 9 తెలంగాణా మీద ప్రకటన చేసి ఉండాల్సింది కాదు అని చిదంబరంను దిగ్విజయ్ అనే సరికి చిదంబరం కు కోపం వచ్చిందట. .ఆ ప్రకటన వల్ల మన పార్టీకి ఈ పరిస్తితి వచ్చింది. సో ఎనీ వే మనం పార్టీ ని గాడిలో పెట్టె బాద్యత మేడం అప్ప చెప్పారు. 2014 ఎన్నికలలో పార్టీ ఇమేజ్ పోకుండా పార్టీని పునర్మించాలి. రాహుల్ ప్రదాని కావటమే మన లక్ష్యం. 
 
దిగ్విజయ్ మాటల్లో... సిఎం కిరణ్ నుండి మనకి ఎప్పటి కప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది....కిరణ్ తో ప్రాబ్లం ఏమి లేదు...తను సమైక్యం వైపే ఉన్నాడు. జగన్ తో భేటీ కి ఢిల్లీకి పిలవాలి...అది ప్లాన్ చెయ్యండి. తను ఢిల్లీ వస్తే ప్రాబ్లం అవుతుందని చిదంబరం అంటే మీరు  హైదరాబాద్ వెళ్ళండి...ఓ ప్రైవేటు కార్యక్రమం ప్లాన్ చేసుకొని హైదరాబాద్ వెళ్లి కలవండి అని దిగ్విజయ్ సూచించటం జరిగింది. ఎట్టి పరిస్థితిలో కెసిఆర్ అండ్ టీం కు తెలియకుండా జాగ్రత పడండి అని అహ్మద్ పటేల్ అన్నారట. 
 
హోం మంత్రి షిండే మాటల్లో....2014 ఎన్నికల వరకు ఈ అంశం మీదే దృష్టి పెడదాం... ఆ స్టేట్మెంట్స్ గురించ్గి నేను చూసుకుంటాను...ఎప్పటి కప్పుడు మీడియా సమావేశాలు పెట్టి మరి తెలంగాణా ఇస్తున్నాం అని తెలియ చేద్దాం. మేడంకి ఇన్ఫర్మేషన్ మీరు తెలియ చెయ్యండి అందరు కలిసి అహ్మద్ పటేల్ కు చెప్పటం జరిగింది. 
 
2014 ఎన్నికల్లో రాహుల్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు చెయ్యాలి...ఆంధ్ర ప్రదేశ్ నుండి ఏ ఒక్క అవ్వకాసాన్ని మిస్ కావద్దు. మనకొచ్చిన రిపోర్ట్స్ ప్రకారం.....తెలుగు దేశం మరియు జగన్ మద్య పోతినే జరుగుతుంది. అవసరమైతే కిరణ్ తో పార్టీ పెట్టె ఆలోచన ఇప్పుడైతే వద్దు. ముందు ముందు చూద్దాం. మీడియా తో జాగ్రత్తగా ఉండండి... రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వవద్దు అని సమావేశం ముగించారు.
 
తెలంగాణా మీద కాంగ్రెస్ చేస్తున్న ప్రకటనలు పచ్చి మోసమని ఈ లీకులతో బట్ట బయలైంది. నేతలు ఇప్పటికైనా తెలంగాణా ఫోబియా నుండి బయటకు రండి. కాంగ్రెస్ మోసపూరిత ప్రకటన వల్ల ఎంతో మంది ఆమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ ప్రాణాలను కాంగ్రెస్ తిరిగి ఇవ్వగలదా? ఎన్నడు లేని విదంగా రాష్ట్రంలో పరిస్థితులు చేజరాయి. సీమాంధ్రలో 82 రోజుల బంద్ వల్లన ప్రజలు ఎంతో నష్ట పోయారు. దీనికి కాంగ్రెస్ సమాధానం ఏంటి ?

0 comments:

Post a Comment

 
Top