బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ వివాహ వేడుక త్వరలో జరగనుంది. సిద్దార్థ రాయ్ కపూర్ తో విద్యా బాలన్ వివాహం ఈ నెల 14న జరగనుంది. ఈ సందర్భంగా నిర్వహించే సంగీత్ వేడుక మంగళవారం నాడు జరిగింది.


ఈ కార్యక్రమంలో సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. బంద్ర లో ఉన్న విద్యాబాలన్ ఇంట్లో ఈ సంగీత్ వేడుక జరిగింది. బాలీవుడ్ వాతావరణం ఈ వేడుకలో కనిపించక పోవడం విశేషం. సిద్దార్థ రాయ్ కపూర్ సోదరులు కునాల్ రాయ్ కపూర్, అదిత్య రాయ్ కపూర్, విద్యాబాలన్ సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సంగీత్ వేడుకలో సిద్దార్థ రాయ్ కపూర్ తెల్లటి కుర్తా ధరించగా, విద్యాబాలన్ కాంజీపురం పట్టు చీర కట్టుకుంది. 

0 comments:

Post a Comment

 
Top