కలకత్తా చీకటి సామ్రాజ్య కార్యకలాపాలను ఇందులో విష్ణువర్థన్ కొత్తగా ఆవిష్కరించారని వినికిడి. పవర్‌స్టార్ పెర్‌ఫార్మెన్స్ ఈ చిత్రానికి మెయిన్ ఎట్రాక్షన్. సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా వర్క్స్ సంయుక్త నిర్మాణంలో నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ‘‘ఆద్యంతం ఆసక్తికరంగా నడిచే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. పవన్ కల్యాణ్ అభిమానులు ఆశించే అన్ని అంశాలతో సినిమా స్టయిలిష్‌గా ఉంటుంది. ఇప్పటివరకూ వచ్చిన పవన్‌కల్యాణ్ సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నాయి. నవంబర్ 13న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో భారీ ఎత్తున ఆడియో ఆవిష్కరణ చేయబోతున్నాం. యువన్‌శంకర్‌రాజా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. డిసెంబర్ 9న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. పవన్‌కల్యాణ్ సరసన సారాజేన్ డయాస్, అంజలి లావానియా నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆడవి శేష్, జాకీష్రాఫ్, అతుల్ కులకర్ణి, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు, ఝాన్సీ, తనికెళ్ల భరణి, పరుచూరి వెంకటేశ్వరరావు, సంపత్, కిశోర్ ముఖ్య తారలు. ఈ చిత్రానికి కెమెరా: పి.ఎస్.వినోద్, ఎడిటింగ్: ఎ.శ్రీకర్‌ప్రసాద్, యాక్షన్ కొరియోగ్రాఫర్: శామ్ కౌశల్, ఆర్ట్: సునీల్‌బాబు, స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, సంభాషణలు: అబ్బూరి రవి, స్టైలింగ్:అనూ వర్థన్. |
Home
»
PANJA Wallpapers
»
PAWANKALYAN
»
Takes Long Time to shudown or restart your Computer/Laptop/PC
»
Trailers
» Panjaa Trailers Crossing 2lac + Views
Related Posts
Anjali Lavanya Latest Stills From Panjaa Moviee
09 Dec 20110Anjali Lavanya Latest Stills From Panjaa Read more »
Panja Fame Sarah Jane Dias Hot PhotoShoot..
22 Nov 20110Panja Fame Sarah Jane Dias Hot PhotoShoot.. Read more »
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.