గ్యాంగ్ రేప్ బాధితురాలిని సింగపూర్ పంపడం వెనక ఎన్నో అనుమానాలు
వ్యక్తమవుతున్నాయి. విమర్శలు మొదలవుతున్నాయి. గ్యాంగ్ రేప్ ఘటనపై దేశంలో
ఎగిసిపడుతున్న నిరసనల నుంచి దృష్టి మరల్చడానికేనా. కొన ఊపిరితో ఉన్న
బాధితురాలిని అంతదూరం తీసుకెళ్లారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమానత్‌ను
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా సింగపూర్‌కు తరలించడం తప్పేనని వైద్యులు
అంటున్నారు. చివరి దశలో పేషెంట్‌ను విదేశాలకు తరలించడం తప్పని వైద్యులు
అంటున్నారు.
తొలుత చిన్న ఘటనగా భావించి.. తేలిగ్గా తీసుకున్న కేంద్రం, ఢిల్లీ
ప్రభుత్వాతలు ఇంత పెద్ద ప్రజా ఉద్యమాన్ని చూసేసరికి కాళ్లకింద నేల
కదిలింది. అందులో భాగమే సోనియా, ప్రధాని, ఢిల్లీ సీఎం దిగి వచ్చి యువతతో
సంప్రదింపులు చేయడం.. బాధితురాలికి తగిన వైద్య సాయం అందిస్తామని హామీ
ఇచ్చారు. బాధితురాలి పరిస్థితి క్రమంగా క్షీణిస్తున్న నేపథ్యంలో
ఆందోళనకారులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయవచ్చనే ఆలోచనకు తోడు.... ఆమెకు
మెరుగైన వైద్యం అందిస్తున్నామన్న భరోసా ఇవ్వడం కోసం సింగపూర్ తరలించారు.
ఢిల్లీ పెద్దల విన్నపాలను పౌర సమాజం లెక్కచేయకపోవడంతో ఈ ఘటన నుంచి ప్రజల
దృష్టి మరల్చడానికి యువతికి మెరుగైన చికిత్స కోసం సింగపూర్ పంపాలని
ప్రభుత్వం యోచించింది. ఇంకా పది రోజుల పాటు వెంటిలేటర్‌పై చికిత్స అందించిన
అమానత్‌ను ఆందోళనలను అదుపుచేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం సింగపూర్‌కు
చికిత్స కోసం తరలించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మూడు ఆపరేషన్లు జరిగినా, పది రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉన్న అమానత్ మెదడుకు
బలమైన గాయం తగలడంతో ఆమె మృతి చెందిందని వైద్యులు చెబుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment