‘అరవింద్-2’ గీతావిష్కరణ ఇటీవలే జరిగింది. శేఖర్ సూరి దర్వకత్వం వహిస్తున్న
ఈ చిత్రంలో శ్రీ, మాధవీలత, అడొనిక, కమల్ కామరాజు నటిస్తున్నారు. ఈ చిత్రం
ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉందని చెబుతున్నారు, అయితే... ఈ ట్రైలర్ ని సంగీత
దర్శకుడు ఇచ్చిన మ్యూజిక్ కి అనుగుణంగా సీన్లు ఎడిట్ చేశారట. ఈ సినిమాకి
విజయ్ కూరాకుల సంగీతాన్ని సమకూర్చుతున్నారు.
ముందుగా ఓ బీజీఎమ్ కంపోజ్ చేసి దర్శకుడికి ఇస్తే... దానికి అనుగుణంగా
ట్రైలర్ ని ఎడిటింగ్ చేయించారు దర్శకుడు. మామూలుగా అయితే ముందు విజువల్స్
ఎడిట్ చేశాకనే... నేపథ్య సంగీతం జోడిస్తారు, ఇది రొటీన్ కి భిన్నంగా
జరిగింది. ఇదే విషయాన్ని పలువురు సినీ విమర్శకులు చర్చించుకుంటున్నారు.
మరి, సినిమా ఏ రేంజిలో భయపెడుతుందో వేచి చూడాలి.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.