అఖిలపక్ష సమావేశం తీరుపై రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయసీమ ప్రాంతం రాజకీయ నాయకుల చేతిలో గ్యాంగ్ రేప్ కు గురైందని బైరెడ్డి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సీఎం కిరణ్ కూడా రాయలసీమ ప్రాంతానికి కు అన్యాయం జరుగుతుంటే నోరు మెదపలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఇక ఖాయమైందని... ఇప్పుడు రాయలసీమ గురించి మాట్లాడే నేతలు కరువయ్యారని బైరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదిగి సీఎం పదవి దక్కించుకునేందుకు సీమను ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకే సమైక్యాంధ్ర కావాలని అడుగుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాంత నాయకులకు వారి ప్రాంతం మీద మమకారం ఉందని, కాని రాయలసీమ నేతలకు తమ ప్రాంతం మీద మమకారం లేదని విమర్శించారు.

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top