పవన్ కల్యాణ్, మహేష్ బాబు... ఒక రకంగా మంచి స్నేహితులనే చెప్పుకోవాలి. అదెలా అంటే... పవన్ కు త్రివిక్రమ్ మంచి స్నేహితుడు, త్రివిక్రమ్ కి మహేష్ మంచి స్నేహితుడు, ఆ స్నేహంతోనే... త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన జల్సా సినిమాలో నేపథ్య గాత్రం చెప్పేలా మహేష్ ను ఒప్పించాడు త్రివిక్రమ్. అలా పవన్, ప్రిన్స్ ల మధ్య స్నేహం మొదలైంది. ఆ స్నేహం ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో దర్శకుడు త్రివిక్రమ్ నటించనున్నాడు. ఈ సినిమాకు మరింత కిక్ ఇచ్చేందుకు... ఇందులో మరో ప్రత్యేక పాత్ర ను స్రుష్టించాడట త్రివిక్రమ్. అది మరెవరికో కాదు... మహేష్ బాబుకి. ఈ చిత్రంలో కీలక సన్నివేశంలో ప్రధాన పాత్రలో మహేష్ కనిపిస్తాడట. మామూలుగానే పవన్ సినిమా అంటే అభిమానులకు పండగ. అందులో మహేష్ కూడా ఉన్నాడంటే... పండగను మించిన పదం ఏదైనా వెతకాలి. ఏమంటారు?

0 comments:

Post a Comment

 
Top