హైదరాబాద్: తాజా మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వలేదని టీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు పదవులను ఆశించకుండా... ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాలని ఈటెల హితవు పలికారు. మంత్రివర్గంలో కూడా తెలంగాణకు 42 శాతం వాటా ఇవ్వాల్సిందేనని ఈటెల డిమాండ్ చేశారు. కిరణ్ సర్కార్ ఆంధ్రా పక్షపాతియని ఆయన విమర్శించారు.

0 comments:

Post a Comment

 
Top