హైదరాబాద్: సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డితో తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి సమావేశమయ్యారు. పీఆర్పీకి చెందిన ఇద్దరికి మంత్రి పదవులను కేటాయించిన నేపథ్యంలో సీఎంను చిరంజీవి కలిశారు. శాఖల కేటాయింపుపై ప్రధానంగా వీరిమధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. తాజా మంత్రివర్గ విస్తరణలో పీఆర్పీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు మంత్రిపదవులు కేటాయించిన సంగతి తెలిసిందే.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment