రితీష్‌తో పెళ్లెప్పుడు? అని అడిగితే చాలు... మిరపకాయ్ తిన్న కోతిలాగా మీడియావారిపై అంతెత్తునలేచే జెనీలియా... ఇప్పుడు అదే ప్రశ్నను ఆమెగారు ముందు ఉంచితే.. ముద్దబంతిలా సిగ్గుతో ముడుచుకుపోతున్నారు. తమ పెళ్లికీ ఇరు వర్గాల నుంచీ గ్రీన్ సిగ్నల్స్ రావడమే అందుకు కారణం కావచ్చు. ప్రస్తుతం రితీష్ పక్కన లేకుండా ఏ ఫంక్షన్‌కీ జెన్నీ అమ్మడు అటెండ్ కావడం లేదట.

పైగా ఆయా పార్టీల్లో ఈ జంట పక్కకెళ్లి ఏకాంతంగా గడుపుతుండటం బాలీవుడ్‌లో పెద్ద చర్చకే దారితీస్తోంది. తాజాగా ముంబయ్‌లో జరిగిన ‘డాన్-2’ ప్రీమియర్‌లో కూడా ఈ ‘లవ్ పెయిర్’ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అది సరే... మరి కెరీర్ సంగతేంటీ? అని జెన్నీని అడిగితే- ‘‘‘ఇట్స్ మై లైఫ్’ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

తేరే నాల్ లవ్ హోగయా, రాక్ ది షాదీ సెట్స్ మీద ఉన్నాయి. తెలుగులో ‘నా ఇష్టం’ చేస్తున్నాను. దీన్ని బట్టి నా కెరీర్ ఎలా ఉందో మీరే ఓ అంచనాకు వచ్చేయండి’’ అంటూ తనదైన శైలిలో నవ్వులు చిందిస్తూ సమాధానమిచ్చారు జెన్నీ.

0 comments:

Post a Comment

 
Top