ధనుష్ పాడిన ‘కొలవెరి...’ పాటకు యూత్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అటువంటి క్రేజీ పాటకు స్టార్ హీరోయిన్ తమన్నా స్టెప్పులేస్తే?... ‘ఆహా.. ఎంత అందమైన ఊహ’ అనుకుంటున్నారా? అది ఊహ కాదు.. నిజమే. ఈ నెల 21న తమన్నా పుట్టినరోజు వేడుక చెన్నయ్‌లో ఘనంగా జరిగింది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జరిగిన పార్టీలో ‘కొలవెరి’ పాటను ధనుష్ పాడగా తమన్నా తనదైన శైలిలో అందంగా స్టెప్పులేశారు. శ్రుతిహాసన్, పూనమ్‌భజ్వా, ఇలియానా తదితర అందమైన భామలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని సమాచారం. తమన్నా స్టెప్స్‌ని వారంతా విపరీతంగా ఎంజాయ్ చేశారట.

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top