అహల్య నిజంగానే అమాయకురాలా?
"అహల్య అమాయకురాలు".... అవును మా అహల్య నిజంగా అమాయకురాలే! ఎందుకు, ఏమిటి అన్న వివరాలు తెలుసుకోవాలంటే మరో రెండు నెలలు ఆగాల్సిందే... ఏ ఆర్‌ ఆర్‌ మీడియా టాకీస్‌ పతాకంపై నిర్మితమవుతున్న తాజా చిత్రం పేరు "అహల్య అమాయకురాలు". సినిమా రంగంతో గత దశాబ్ధానికి పైగా అనుబంధమున్న ముగ్గురు టెక్నీషియన్స్‌ ఒక టీంగా ఏర్పడి స్థాపించిన బ్యానర్‌ "ఏ ఆర్‌ ఆర్‌ మీడియా టాకీస్‌". రేడియో, టీవీ మరియు సినిమా ఇండస్ట్రీలలో అపార అనుభవం గడించిన ఈ మిత్రులు తమ తొలి ప్రయత్నంగా చేయబోతున్న చిత్రానికి "అహల్య అమాయకురాలు" అనే తమాషా టైటిల్‌ నిర్ణయించారు. ప్రస్థుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు తుదిదశలో ఉన్నాయి. దీనితో పాటుగా సినిమాలో నటించబోయే  నటీనటుల ఎంపిక ప్రక్రియ కూడా శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ, తమ చిత్రం పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన బ్లాక్‌ బస్టర్‌ సినిమా "అత్తారింటికి దారేది" లోని పాపులర్‌ స్కిట్‌ "అహల్య అమాయకురాలు" కు ఏ మాత్రం తగ్గని రీతిలో పూర్తి వినోదాత్మకంగా సాగే ఓ మాంచి థ్రిల్లర్‌ లా సాగే ఆహ్లాదకరమైన చిత్రం అని తెలియచేశారు. మొత్తం 12 మంది నటీనటులపై సాగే ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి ఉన్న నూతనతారలకు ఆహ్వానం పలుకుతున్నారు ఏ ఆర్‌ ఆర్‌ మీడియా టాకీస్‌ వారు. టాలెంట్ ఉన్న నటీనటుల కోసం కూడా అన్వేషిస్తున్నాం. ఆ టాలెంట్ మీలో ఉంటే మీ వివరాలు, బయోడేటాలను వెంటనే "arrmediatalkies@gmail.com" మెయిల్ ఐడి కు పంపించగలరు.... లేదా 7396370786 / 9666120456 నెంబర్ లకు కాల్ చెయ్యండి.



0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top