356 పైనే…! నైజాంలో రికార్డుల దిశగా ‘తుఫాన్’ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
తేజ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ ‘జంజీర్’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా
సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు
వెర్షన్‌ను ‘తుఫాన్’ పేరుతో విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రం నైజాం
ఏరియాలో రికార్డు స్థాయి థియేటర్లలో విడుదలవుతోంది. హిందీ, తెలుగు వెర్షన్
కలిపి నైజా ఏరియాలో మొత్తం 356 థియేటర్లలో విడుదలవుతోంది. ఒక్క
హైదరాబాద్‌లో ఈ చిత్రం 106 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. సీమాంధ్ర
ప్రాంతంలోనూ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. జంజీర్ రామ్
చరణ్‌కు సౌతిండియాలో ముఖ్యంగా తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉండటం, ప్రియాంక
లాంటి స్టార్ హీరోయిన్ కావడం, అపూర్వ లఖియా దర్శకత్వం లాంటి అంశాల
మేళవింపుతో సినిమా భారీ కలెక్షన్స్ సాధిస్తుందని ఆశిస్తున్నారు. సినిమా
ఫస్ట్ డే టాక్, ఓపెనింగ్స్ ఎలా ఉంటాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
1975లో అమితాబ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘జంజీర్’ చిత్రానికి రీమేక్‌గా అదే పేరుతో తెరకెక్కించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఏసిపీ విజయ్ ఖన్నా పాత్రలో నటించాడు. షేర్ ఖాన్ పాత్రలో హిందీలో సంజయ్ దత్, తెలుగులో శ్రీహరి పోషించగా, మోనా డార్లింగ్ పాత్రలో నటించింది. తనికెళ్ల భరణి, దేవ్ గిల్ కీలకమైన పాత్రలు పోషించారు. రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా హీరోయిన్. శ్రీహరి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు.

0 comments:
Post a Comment