పవన్ కల్యాణ్. పేరులోనే పవరుంది. ఆయనేం
చేసినా ఒక సెన్సేషన్. ప్రస్తుతం యూత్ లో ఆయనకున్న క్రేజ్ అలాంటిది.
మెగాస్గార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ లో ఆయన అతిథి పాత్ర లో
మెరిసిన సంగతి మనకందరికీ తెలిసిందే.
ప్రస్తుతం మరో సినిమాలో అతిథి పాత్రలో
మెరవబోతున్నాడనే వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది.పెద్ద స్టార్లు
నటించే సినిమాలో కాకుండా ఒక చిన్న సినిమాలో ఆయన కనబడబోతున్నాడని సమాచారం.
మరి ఆ సినిమా ఎవరిదో కాదండోయ్. తమ్మారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న
ప్రతిఘటన. ఈ సినిమాలో ఛార్మి ముఖ్యపాత్ర పోషిస్తుంది.
ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో
నటించడానికి తమ్మారెడ్డి హీరో గోపిచంద్ ని కలిశాడట. ఆయనకు వీలుకాకపోవడంతో
సంధిగ్థంలో పడిన తమ్మారెడ్డి పవన్ కల్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ ని కలిసి
పాత్ర గురించి వివరించి పవన్ ని ఆ పాత్ర చేస్తే బాగుంటుందని అన్నాడట..
మరెమో ఇప్పుడు బాల్ పవన్ కోర్టులో ఉంది. ఇంతకు ముందు చిరంజీవితో కలిసి
నటించిన అది కుటుంబ కథా చిత్రం కావడంతో అందరూ మామూలుగానే రియాక్ట్ అయ్యారు.
ఇప్పుడేమో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో
కనిపించడానికి పవన్ ఒప్పుకొంటాడో లేదో చూడాలి. ముఖ్య విషయమేమంటే ఈ చిత్రంలో
చిరంజీవి మీద కూడా సెటైర్స్ ఉన్నాయని వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ చిత్రంలో
పవన్ ఈ సినిమాలో నటిస్తాడంటారా! ఒకవేళ నటిస్తే అది ఎలాంటి పరిణామాలకి దారి
తీస్తుందేమో చూడాలి మరి.
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.