వైద్య సేవల నిమిత్తం సింగపూర్ వెళ్ళిన రజిని ఆరోగ్యం మెరుగుపడిందని కుటుంబసభ్యులు తెలియజేసారు. అక్కడ మౌంట్ ఎలిజిబెత్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న రజని త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవుతారని తెలుస్తుంది. ఆయనకు కిడ్నీ మార్పిడి జరుగుతుందని వస్తున్న వార్తలను కుటుంబసభ్యులు ఖండించారు.
రజిని అల్లుడు ధనుష్ విలేకరులతో మాట్లాడుతూ రజిని సూపర్ గా ఉన్నారు, మరో పది రోజుల్లో లేటెస్ట్ గా తిరిగి వస్తారని అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే తిరిగి వచ్చి కొంత విశ్రాంతి తరవాత 'రాణా' షూటింగ్ లో పాల్గొంటారని తెలిపారు. గత కొంతకాలంగా నిమోనియా, గ్యాస్ట్రిక్ సంబంద అనారోగ్యంతో బాధపడుతున్న రజిని త్వరగా కోలుకోవాలని దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు పూజలు, ప్రార్ధనలు చేస్తున్నారు.
మరో వైపు రజిని 'రాణా' సినిమా తరవాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పనున్నాడనే వార్త అనధికారికంగా చక్కర్లు కొడుతుంది. ధనుష్ మాట్లాడిన మాటలను బట్టి అదే స్పష్టం అవుతుందని కొన్ని వర్గాలు ప్రచారం మొదలు పెట్టాయి. అయితే బాబా సినిమాతోనే రజిని సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నాడు. కానీ అది జరగలేదు. ఎందుకంటే రజినిని సినిమాలనుండి, అభిమానుల నుండి విడతీయటం ఎవరి తరం కాదు అని ఆయన అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు. ఇలా ఎవరికీ తోచినట్టు వాళ్ళు ఏమనుకున్నా చివరకి ఏమి జరగనుందో కాలమే నిర్ణయిస్తుంది.

0 comments:
Post a Comment