అవినీతికి పాల్పడే వారికే కాదు, సామాన్య జనంకు కూడా బాగా తెలిసిన వ్యక్తి సీబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ. రాష్ట్రంలో సంచలనం రేపిన ఎమ్మార్ కుంభకోణం, ఓఎంసీ అక్రమ మైనింగ్, జగన్ అక్రమాస్తుల కేసులను ఆయనే విచారణ జరుపుతున్నారు. గాలి జనార్థన్ రెడ్డి లాంటి వ్యక్తిని మూడో కంటికి తెలియకుండా అరెస్ట్ చేసి సంచలనం సృష్టించిన అధికారి ఆయన. ఆక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ ను సైతం గడగడలాడించారు. కనిపించుట లేదు! ఐపీఎస్ హోదానే ఇంటి పేరుగా మార్చుకున్న ఘనత లక్ష్మినారాయణకే దక్కుతుంది. గాలి జనార్థన్ రెడ్డినే కాదు . అలాంటి అధికారులు హఠాత్తుగా కనపడకుండా పోయారు. ఇంతకూ సీబీఐ జేడీ ఏమయ్యారు. ఎందుకు కనిపించడం లేదు. కేసుల విచారణ క్రమంలోనే ఇలా చేస్తున్నారా? లేక ఇతర కారణాలు ఎమైనా ఉన్నాయా అన్నది చర్చనాయాంశంగా మారింది. అందుకే మీడియాకు దూరం? 2006 నుంచి జేడీ లక్ష్మీనారాయణ ఇక్కడే కొనసాగుతున్నారు. పదవీకాలంతో పాటు, డిప్యుటేషన్ కూడా పూర్తయింది. జేడీని బదిలీ చేయాలని కేంద్రంపై భారీగా ఒత్తిడి తెస్తున్నారు. అయితే కీలక కేసులను దర్యాప్తు చేస్తున్న జేడి... కేసుల పురోగతి, ఇతర పెద్దల పేర్లు బయటకు పొక్కకూడదన్న ఉద్దేశ్యంతోనే.. జేడీ సైలెంట్ గా ఉన్నారనే వాదన వినిపిస్తుంది. మరోవైపు అదిష్టానం పెద్దలతో వైఎస్సార్సీపీ నేతలు రహస్య ఒప్పందం చేసుకున్నారని.. అందుకే జేడీ పై ఒత్తిడి తెచ్చి మీడియాకు దూరంగా ఉండేలా చేశారని తెలుస్తోంది. అయితే కీలక కేసులు విచారణలో ఉన్నపుడు నిజాయితీ పరుడైన ఆఫీసర్ పై ఇలాంటి ఆరోపణలు సహజమేనన్న వాదన కూడా ఉంది. జేడీ లక్ష్మినారాయణ వ్యవహారంలోనూ అనేక రాజకీయ ఒత్తిడులు పెరుగుతున్నాయన్న వాదన కూడా వినిపిస్తుంది. మొత్తానికి ఎప్పుడు మీడియాలో కనిపించే సీబీఐ జేడీ.. కొంత కాలంగా కనిపించకపోవడం.. కేసుల దర్యాప్తు పైనా ప్రభావం చూపుతోందన్న వాదన కూడా వినిపిస్తోంది. మరి తెరవెనుక ఉన్న జేడీ ఏ అవినీతి చేపను పట్టుకుని తెరపైకి వస్తారో చూడాలి.

0 comments:

Post a Comment

 
Top