లోక్ పాల్‌కు రాజ్యాంగ హోదా కల్పిస్తున్న రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్ సభ మంగళవారం రాత్రి 11 గంటలకు జరిగిన ఓటింగులో ఆమోదం లభించింది. బిల్లుకు అనుకూలంగా 321 ఓట్లు, వ్యతిరేకంగా 71 ఓట్లు లభించాయి. సభలో మొత్తం 394 మంది ఉన్నారు.
బారతీయ జనతా పార్టీ, వామపక్షాలు సూచించిన సవరణలను సభ త్రోసిపుచ్చింది. బి.ఎస్.పి, సమాజ్‌వాది పార్టీలు లోక్ పాల్ బిల్లుపై ఓటింగు జరగడానికి ముందే వాకౌట్ చేశాయి. సభలో మొత్తం పది సవరణలపై సభలో మూజువాణి ఓటింగు జరిగింది. కార్పొరేట్లను కూడా లోక్‌పాల్ బిల్లు పరిధిలోకి తీసుకురావాలన్న వామపక్షాల డిమాండు నీరుకారిపోయింది. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కార్పొరేట్‌లు అవినీతికి పాల్పడే అవకాశం ఉంది కాబట్టి కార్పొరేట్లు కూడా లోక్‌పాల్ బిల్లు పరిధిలోకి రావలసిన అవసరం ఉందని వామపక్షాలు భావిస్తున్నాయి.
0 comments:
Post a Comment