హైదరాబాద్ : ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పై, ఆయన బావమరిది అల్లు అరవింద్‌పై మాజీ కేంద్ర మంత్రి పి. శివశంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసు పార్టీలో విలీనం చేసుకునేంత సీను చిరంజీవికి లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. బావ చిరంజీవి, బావ మరిది చిరంజీవి ఎన్నికల్లో సీట్లు అమ్ముకున్నారని, వారిని ఎవరూ నమ్మరని ఆయన ఆయన అన్నారు. డబ్బులు దండుకోవడమే సామాజిక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. చిరంజీవిని చర్చలకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా ఆహ్వానించడం సరైంది కాదని ఆయన అన్నారు.

చిరంజీవిని చేర్చుకునే దుస్థితికి కాంగ్రెసు పార్టీ వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసు బలహీన పడిందని ఆయన అన్నారు. చిరంజీవి ఇంటికి రక్షణ మంత్రి ఆంటోనీ వెళ్లడం సరైంది కాదని, పిసిసి అధ్యక్షుడు వెళ్తే చాలునని ఆయన అన్నారు. చిరంజీవిని చేర్చుకోవడం కాంగ్రెసుకే దెబ్బ అని ఆయన అన్నారు. చిరంజీవి వెంట కాపులు కూడా లేరని ఆయన అభిప్రాయపడ్డారు. పిసిసి అధ్యక్షుడిగా డి. శ్రీనివాస్, ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఎంపిక సరైంది కాదని ఆయన అన్నారు.

0 comments:

Post a Comment

 
Top